: యూనివర్శిటీలకు పవర్ ఫుల్ వీసీలను నియమిస్తాం: సీఎం కేసీఆర్
తెలంగాణలోని యూనివర్శిటీల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పవర్ ఫుల్ వైస్ ఛాన్స్ లర్ ల నియామకం త్వరలోనే జరుగుతుందన్నారు. యూనివర్శిటీల తీరుపై ఆయన మాట్లాడుతూ, కిస్ ఫెస్టివల్ లాంటివి మనదేశంలో నిర్వహిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. అసలు ఇటువంటి ఫెస్టివల్ లు యూనివర్శిటీల్లో ఎందుకు నిర్వహిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల, జేఎన్ యూ ఘటనలు దురదృష్టకరమని... ఈ ఘటనలను ఖండిస్తున్నట్లు చెప్పారు. యూనివర్శిటీలకు సరైన వీసీలు లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని కేసీఆర్ అన్నారు.