: బయటకు రాకుండా ఉంటే శవమై వచ్చుండేదాన్ని: భర్తపై మధుప్రియ తాజా ఆరోపణలు


శ్రీకాంత్ ని ఎంతో ఇష్టపడి తాను వివాహం చేసుకున్నానని, ఆ ప్రేమ గత రాత్రితో పోయిందని గాయని మధుప్రియ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ స్టూడియోలో ఆమె భర్త శ్రీకాంత్ మాట్లాడుతుండగా, మధుప్రియ ఫోన్ లైన్ లోకి వచ్చారు. ఆపై మాట్లాడుతూ, తనను బాగా కొట్టాడని ఆరోపించారు. అమ్మానాన్నల మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న తాను తిరిగి వారి మాటలను విని భర్తపై ఆరోపణలు ఎందుకు చేస్తానని ప్రశ్నించిన మధుప్రియ, అతను దుర్మార్గుడని తెలుసుకున్న తరువాతే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇప్పటికీ బయటకు రాకుండా ఉంటే, తన శవం కనిపించి వుండేదని అన్నారు. కడుపులో తన్నాడని, ఆ తరువాతే ఇక శ్రీకాంత్ దగ్గర ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తనను చేసుకున్నాకే దరిద్రం పట్టుకుందని తిడుతూ వేధించే వాడని, చంపేందుకు కూడా చూశాడని ఆరోపించారు. కాగా, మధుప్రియ ఆరోపణలు అవాస్తవమని శ్రీకాంత్ వాదించాడు.

  • Loading...

More Telugu News