: సరిహద్దుల్లో మోహరించిన చైనా సైన్యం: కేంద్రాన్ని హెచ్చరించిన నిఘా వర్గాలు


చైనాలోని క్సిన్జియాంగ్ ప్రాంతం నుంచి పాక్ లోని గ్వదార్ పోర్టు వరకూ నిర్మితమైన ఎకనామిక్ కారిడార్ ను కాపాడుతున్నామన్న కారణం చూపుతూ సరిహద్దుల్లో 3 వేల మంది చైనా దళాలను ఆ దేశం మోహరించిందని నిఘా వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. సాయుధులైన మూడు రెజిమెంట్ల (ఒక్కో రెజిమెంట్ లో 1000 మంది సైనికులుంటారు) దళాలు హైవేపై పహారా కాస్తున్నాయని తెలిపాయి. చైనా, పాక్ ల మధ్య సీపీఈసీ (చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్) బెలూచిస్తాన్ లో ప్రారంభమై మకరాన్ తీరం గుండా లాహోర్, ఇస్లామాబాద్ నగరాలను కలుపుతూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్జిత్ - బాల్టిస్థాన్ ప్రాంతాల మీదుగా కోకారం హైవేకు చేరి, ఆపై క్సిన్జియాంగ్ ప్రావిన్స్ లోని కస్గర్ వద్ద ముగుస్తుందన్న సంగతి తెలిసిందే. కారిడార్ భద్రత పేరిట సైన్యాన్ని మోహరించడంతో భారత్ కు ఇబ్బందికరమేనని, అక్కడ జరుగుతున్న వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News