: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మేకింగ్ వీడియో విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం మేకింగ్ వీడియోను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మేకింగ్ వీడియో విడుదలవడం అభిమానులకు మంచి జోష్ ఇస్తోంది. కాగా, బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.