: ముదిరిన‌ స్మార్ట్ ఫోన్ పిచ్చి.. వేలు కోసేసుకున్న 11 ఏళ్ల బాలుడు


నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ల ప్ర‌భావం ఎంత‌గా ఉందో ప్ర‌త్యేకించి చెప్పే అవ‌స‌రం లేదు. స్మార్ట్ ఫోన్ ఫీచ‌ర్స్ లో సెల్ఫీ, మొబైల్ యాప్స్, గేమ్స్, ఇంట‌ర్ నెట్ కి యువతే కాదు, చిన్నా పెద్దా తేడా లేకుండా ప్ర‌తీ ఒక్క‌రూ ఆక‌ర్షితులవుతున్నారు. కొన్ని ప‌రిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిని కొనితెచ్చుకుంటున్నారు. న్యూయార్క్ లో స్మార్ట్ ఫోన్ పిచ్చితో 11 ఏళ్ల బాలుడు త‌న చూపుడు వేలునే కోసుకున్న సంఘ‌ట‌న... స‌మాజంలో స్మార్ట్ ఫోన్‌ల పిచ్చి ఎంతగా ఉందో చెప్ప‌డానికి అద్దం ప‌డుతోంది. న్యూయార్క్ లో నివ‌సిస్తోన్న చైనాకి చెందిన 11ఏళ్ల బాలుడు.. త‌ల్లిదండ్రులు త‌న ద‌గ్గ‌ర‌నుంచి ఫోన్‌ను లాక్కున్నార‌నే కోపంతో, బాధ‌తో వంటింట్లోకెళ్లి చూపుడు వేలుని కోసేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావ‌డంతో గ‌మ‌నించిన త‌ల్లిదండ్రులు బాలుడ్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మొబైల్ ఫోన్‌కి బానిసైపోయిన ఈ బాలుడ్ని త‌ల్లిదండ్రులు ప‌లుసార్లు హెచ్చ‌రించారు. అయినా త‌న అలవాటు మార్చుకోలేదు. ఉద‌యం నిద్ర‌లేవ‌గానే సెల్‌ఫోన్ ప‌ట్టుకొని ఉన్న బాలుడ్ని చూసి ఆగ్ర‌హించిన త‌ల్లిదండ్రులు దాన్ని లాక్కున్నారు. దీంతో ఆగ్రహించిన బాలుడు సెల్‌ఫోన్ ట‌చ్‌ స్క్రీన్ కు తాను ప్ర‌తిరోజు ఉప‌యోగించే చూపుడు వేలుని కోసేసుకున్నాడు. చివ‌ర‌కు తెగిపోయిన వేలుని శస్త్రచికిత్స చేసి తిరిగి అతికించ‌డానికి వైద్యులకు మూడు గంట‌లు ప‌ట్టింది.

  • Loading...

More Telugu News