: ఐశ్వర్యారాయ్ కేరాఫ్ గుంటూరు జిల్లా!


బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ ముంబయి నివాసి అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఐశ్వర్యారాయ్ కేరాఫ్ గుంటూరు జిల్లాగా మారింది. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... ఏపీ సర్కార్ పేదలకు ఎన్టీఆర్ వైద్య సేవల హెల్త్ కార్డు ఇస్తుంది. ఒక హెల్త్ కార్డులో లబ్ధిదారుల ఫొటోకు బదులు ఐశ్వర్యారాయ్ ఫొటోను పెట్టారు. ఐశ్వర్యారాయ్ పేరిట ఎన్టీఆర్ హెల్త్ కార్డును నిర్లక్ష్యపు అధికారులు మంజూరు చేశారు. గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గంగుపల్లి తాండాకు చెందిన బాణావత్ బాద్యుకు మారు పేరుతో హెల్త్ కార్డు మంజూరైంది. అయితే, ఆ కార్డులో లబ్ధిదారుల పేర్లు ఉన్నప్పటికీ, వారి ఫ్యామిలీ ఫొటో మాత్రం లేదు. దాని స్థానంలో ఐశ్వర్యారాయ్ ఫొటోను అధికారులు ఉంచారు. దీంతో, సదరు లబ్ధిదారులు ఆశ్చర్యపోయారు. తమ ఫ్యామిలీ ఫొటోకు బదులు బాలీవుడ్ నటి ఫొటో రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే దానికి తమకు వచ్చిన హెల్త్ కార్డులో ఉన్న ఫొటోనే నిదర్శనమని అంటున్నారు.

  • Loading...

More Telugu News