: మాల్యా దొరకలేదు... అందుకే మాగంటిని నక్సల్స్ చంపారు: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్య


లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, దివంగత మాజీ ఎంపీ మాగంటి సుబ్బరామిరెడ్డిలకు సంబంధించి సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా కొద్దిసేపటి క్రితం నారాయణ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లోనే కాక వ్యాపారవర్గాల్లోనూ కలకలం రేపుతున్నాయి. విజయ్ మాల్యాకు, మాగంటి కుటుంబానికి మంచి సంబంధాలున్నాయని నారాయణ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో విజయ్ మాల్యాను టార్గెట్ చేసిన నక్సలైట్లు... మాల్యా దొరకకపోయేసరికి మాగంటి సుబ్బరామిరెడ్డిని హత్య చేశారని ఆయన చెప్పారు. మాల్యా అక్రమ లావాదేవీలకు ఇటు బీజేపీ సర్కారుతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ కూడా సహకరించిందని నారాయణ ధ్వజమెత్తారు. వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యాకు కేంద్ర ప్రభుత్వం సహకరించిందని ఆయన ఆరోపించారు. మాల్యాకు, బ్యాంకర్లకు మధ్య కాంగ్రెస్ మధ్యవర్తిత్వం నడిపిందన్నారు. దేశంలో బ్లాక్ మనీ గ్యాంగులు ఎక్కువైపోయాయని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్యాంగులన్నీ దొంగ డబ్బును బంగారంలా మారుస్తున్నాయని విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News