: ఇండియా.. భార‌త్.. మీకు ఎలా పిల‌వాల‌నిపిస్తే అలాగే పిల‌వండి: సుప్రీంకోర్టు


ఇండియా పేరు భారత్‌గా మార్చాలంటూ దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం తిరస్కరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిష‌న్‌ను విచారణకు స్వీకరించలేదు. పిల్‌ అనేది పేదల కోసం ఉద్దేశించిందన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. ‘మాకు చేయడానికి వేరే పని ఏమీ లేదనుకుంటున్నారా?’ అంటూ ప్ర‌శ్నించింది. ఇలాంటివి ప్రోత్సహించరాదని చెప్పింది. పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్ (పిల్‌) పేద ప్రజల కోసమని కోర్టు స్పష్టం చేసింది. దేశాన్ని 'భారత్‌' అని పిలవాలని అనిపిస్తే అలాగే పిల‌వాల‌ని, 'ఇండియా' అని పిలవాలనుకుంటున్న వారిని అలా పిలవనివ్వండంటూ పిటిష‌న్ దారుడికి సుప్రీంకోర్టు తెలిపింది. మ‌హారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త నిరంజన్‌ భత్వాల్‌ కోర్టులో ఈ పిల్‌ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News