: ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేం: దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్
టీ20 ప్రపంచ కప్ లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేమని... ఇది ఓపెన్ టోర్నమెంట్ అయినందున ఏ జట్టు అయినా అద్భుతాలను సృష్టించవచ్చని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. అయితే, టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుందని అన్నాడు. టీ20 ఫార్మాట్ గేమ్ లో టీమిండియా నిలకడగా రాణిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. అయితే, ఈ టోర్నమెంట్ లో అంచనాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదన్నారు. విఫలమవుతున్నామనే ముద్ర నుంచి తాము బయటపడాలంటే ఈ వరల్డ్ కప్ ను సాధించాలని డుప్లెసిస్ అన్నాడు.