: అమితాబ్ మ‌న‌వ‌రాలు బాలీవుడ్‌లోకి ఎంట్రీ..?


లెద‌ర్ ప్యాంట్, షూ, ఫాక్స్ ఫ‌ర్ జాకెట్ తో అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వ‌రాలు (కూతురు శ్వేత కూతురు) న‌వ్య న‌వేలి నంద స్టైలిష్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో ఆమెకు పాప్యులారిటీ తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో ఉంచిన ఫోటోలు ఫ్యాష‌నిస్ట్ గా ఆమె ఉత్సాహాన్ని తెలియజేస్తున్నాయి. అంతేకాదు, న‌వ్య న‌వేలి నంద బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌ని ఆ ఫోటోస్ ద్వారా తెలుస్తోంది. డ్రెసింగ్ స్టైల్ మాత్ర‌మే కాకుండా ఆమె అందమైన ఫిగర్ కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ అమ్మ‌డు ఇక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి అంతా సెట్ చేసేసుకుంద‌ని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News