: ఫస్ట్ ఇన్ హైదరాబాద్... లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన విద్యార్థికి ఒక రోజు జైలు
హైదరాబాద్ నగరంలో లైసెన్స్ లు లేకుండా, హెల్మెట్ లు ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడ్డ ఓ విద్యార్థికి నాంపల్లి కోర్టు ఈ మధ్యాహ్నం ఒక రోజు జైలు శిక్షను విధించింది. ఇస్మాయిల్ అనే విద్యార్థితో పాటు ఆటో డ్రైవర్ ఏడుకొండలు లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడగా వారిని కోర్టు ముందు నిలిపారు. మరోసారి ఇటువంటి తప్పులు చేయవద్దని ఆదేశించిన కోర్టు వారిద్దరికీ ఒక రోజు జైలుశిక్ష విధించింది. కాగా, ఈ నెల 2 నుంచి నగర రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను కఠినం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఓ విద్యార్థికి జైలు శిక్ష పడటం మాత్రం ఇదే తొలిసారి.