: తెలంగాణ స్పీకర్ చాంబరులో రేవంత్, సండ్ర
ఈ మధ్యాహ్నం తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి చాంబరుకు వెళ్లిన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు ఆయనతో భేటీ అయ్యారు. తలసాని రాజీనామా లేఖ, టీడీపీ ఫిర్యాదు లేఖ, తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల లేఖ, ఆపై ఫిరాయింపుదారుల విలీనం లేఖల కాపీలను తమకు అందించాలని వారు కోరినట్టు తెలుస్తోంది. తాము తొలుత ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించకుండా, ఫిరాయింపుదారులు లేఖ రాసిన 24 గంటల్లో ఎలా స్పందిస్తారని ఈ సందర్భంగా రేవంత్ వాదించినట్టు తెలుస్తోంది. ఆ లేఖల కాపీలు ఇవ్వాలా? వద్దా? అన్న విషయమై మధుసూదనాచారి ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని సమాచారం.