: టీఆర్ఎస్ లో చేరిన ఆరెకపూడి, మాగంటి
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ఆరెకపూడి గాంధీలు టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ వీరిద్దరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాగా, టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. అనంతరం ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు. టీడీపీకి అంకిత భావంతో పని చేశానని అన్నారు. మరో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ, గత 34 ఏళ్లుగా టీడీపీకి ఎనలేని సేవలు చేశానని చెప్పారు. ప్రజలు టీఆర్ఎస్ పక్షాన ఉన్నారని, అందుకే తాను ఈ పార్టీలో చేరానని చెప్పారు.