: పూజారికి పూనకం.. కాలుతున్న శవం మాంసం రుచి చూసిన వైనం!


మహాశివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య రోజున 'శ్మశాన కొల్'ల అనే కార్యక్రమాన్ని తమిళనాడులో నిర్వహించడం ఆనవాయతీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పూనకం దాల్చితే .. శ్మశానంలో మంటల్లో కాలుతున్న శవం మాంసాన్ని శూలంతో పొడిచి రుచి చూస్తారు. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి తిరుచ్చిలో గత బుధవారం జరిగింది. పెరియకడై వీధిలోని అంకాళ పరమేశ్వరి ఆలయం ఉంది. ఈ నెల 6న ఆ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. గత బుధవారం రాత్రి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆలయానికి చెందిన పూజారి ఒకరు అమ్మవారి వేషం వేసుకుని, చేతిలో శూలం ధరించాడు. అర్ధరాత్రి సమయంలో శ్మశానానికి భక్తులతో కలసి చేరుకుని.. శ్మశాన కొల్ల కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో పూజారికి పూనకం రావడంతో అక్కడ కాలుతున్న ఒక శవం వద్దకు పరుగెత్తుకు వెళ్లాడు. తన వద్ద ఉన్న శూలంతో ఆ శవాన్ని పొడిచాడు. ఆ తర్వాత శూలాన్ని బయటకు తీయగా దానికి అంటుకుని వచ్చిన మాంసం ముక్కను నోట్లో వేసుకున్నాడు. అనంతరం, పూజారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లారు.

  • Loading...

More Telugu News