: 18న విచారణకు రా... మాల్యాకు ఈడీ సమన్లు!
అరెస్టుకు భయపడి లండన్ పారిపోయాడని భావిస్తున్న యూబీ గ్రూప్ మాజీ బాస్ విజయ్ మాల్యాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లను జారీ చేసింది. ఈనెల 18న ఆయన ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ ఉదయం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ చీఫ్ ఫైనాన్షియర్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) ఎ.రఘునాథన్ ను విచారించిన ఈడీ, సంస్థ ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీసింది. కాగా, ఐడీబీఐ బ్యాంకుకు చెందిన 10 మందికి పైగా అధికారులకూ ఈడీ సమన్లు పంపింది. వీరందరూ గడచిన ఐదేళ్లుగా సమర్పించిన ఐటీ రిటర్నులను తీసుకురావాలని ఆదేశించింది.