: 'టైమ్స్ నౌ' ఎడిటర్ ను జైల్లో పెట్టి చిప్పకూడు తినిపించాలి: విజయ్ మాల్యా


తనపై తప్పుడు కథనాలు ఇస్తున్న 'టైమ్స్ నౌ' ఛానెల్ సంపాదకుడిని జైల్లో ఉంచాలని, చిప్పకూడు తినిపించాలని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు. బ్యాంకులకు రుణాలను బకాయిపడ్డ కేసులో అరెస్టును తప్పించుకునేందుకు దేశం వీడి పారిపోయారని భావిస్తున్న యూబీ గ్రూప్ మాజీ అధినేత విజయ్ మాల్యా ఈ తెల్లవారుఝామున సంచలన ట్వీట్లు చేశారు. తాను పారిపోయానని రాయడం చెత్త అబద్ధమని అన్నారు. మీడియా విచారణ తనకు అక్కర్లేదని, భారత చట్టాలను గౌరవిస్తానని అన్నారు. మీడియా భూతం ఓసారి వేటాడటం ప్రారంభిస్తే, అది కొనసాగుతూనే ఉంటుందని, నిజాన్ని చంపేసి బూడిద చేసేంత తీవ్రంగా ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News