: టీ-టీడీపీలో మిగిలింది ఇక ముగ్గురే!
టీ-టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా స్పీకర్ మధుసూదనాచారి ఆమోదించారు. దీంతో ఇక టీ-టీడీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కొనసాగుతారు. వారి వివరాలు.. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య. కాగా, అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 83కు చేరింది. ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, బీఎస్పీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.