: 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తింపు


టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి తన నిర్ణయాన్ని ప్రకటించారు. టీడీపీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో ఒక లేఖ ఇచ్చారు. ఈ లేఖను స్పీకర్ ఆమోదించారు. ఈ పది మందితో పాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ లను కూడా టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా స్పీకర్ గుర్తించారు. మాగంటి గోపీనాథ్, గాంధీలు తమను టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తించాలంటూ ఇటీవల స్పీకర్ కు లేఖలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రేపోమాపో టీఆర్ఎస్ లో చేరిపోనున్నారు. కాగా, టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా ఆమోదం పొందిన ఈ ఎమ్మెల్యేలకు రేపు సీట్ల కేటాయింపు జరగనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News