: అతిచిన్న వయసులో పాన్‌కార్డ్.. రికార్డ్ సృష్టించిన ఐదు రోజుల పాప
అతిచిన్న వయసులోనే పాన్‌కార్డ్ పొంది బీహార్‌లో ఓ పాప రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ పాప వయసెంతో తెలుసా.. కేవలం ఐదు రోజులు. గతంలో ఈ రికార్డు జయపురకి చెందిన ఆర్యన్ చౌదరి అనే ఏడు రోజుల బాబు పేరుతో ఉంది. తాజాగా, పుట్టిన ఐదోరోజునే ఆ రికార్డు బ్రేక్ చేసిన ఘనతను ఈ పాప సొంతం చేసుకుంది. ముంజేర్ జిల్లాలో వ్యాపార వృత్తిని కొనసాగిస్తున్న కుమార్ సాజల్ అనే దంపతులకు ఫిబ్రవరి 21న కూతురు పుట్టింది. ఆమెకు ఆషిగా అనే పేరు పెట్టి, అదేరోజున ఆమె పేరుతో సాజల్ పాన్‌కార్డుకు దరఖాస్తు చేశాడు. ఫిబ్రవరి 26న ఆషి పేరుపై పాన్‌కార్డు వచ్చింది. దీంతో ఈ రికార్డు ఆషి సొంతమైంది.