: మళ్లీ భంగపడేందుకే అవిశ్వాసం పెట్టారు: టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు


మళ్లీ భంగపడేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టారని చీఫ్ విప్, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. అవిశ్వాసంతో ప్రభుత్వానికేమీ నష్టం లేదని, అవిశ్వాసం ఒక రాజకీయ డ్రామా అని అన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్సీపీ తన పాత్ర పోషించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజా సమస్యలను శాసనసభలో ప్రస్తావించిన పాపాన వారు పోలేదని ఆరోపించారు. ఏ సమస్యపైనా వైఎస్సార్సీపీ నేతలు చర్చించలేదని, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వలేదని, ప్రజల తరపున మాట్లాడిన సందర్భాలు లేనే లేవని అన్నారు. శాసనసభ ప్రారంభమైన రోజు నుంచి నేటి వరకు కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News