: టెన్నిస్ స్టార్ తో దీపికా పదుకునే షికార్లు!
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన దీపికా పదుకునే అక్కడో బాయ్ ఫ్రెండ్ ను పట్టేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఉండగా 'నువ్వు లేక నేను లేను' అనేలా మసలిన రణ్ వీర్ సింగ్ సంగతేంటి? అని పలువురు వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. 'ట్రిపుల్ ఎక్స్' సినిమాలో విన్ డీజిల్ తో జోడీ కడుతున్న దీపికా పదుకునే, తాజాగా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ తో లాస్ ఏంజిల్స్ లో షికార్లు కొట్టింది...కాదు కాదు... డిన్నర్ డేటింగ్ కి వెళ్లింది. జకోవిచ్ ఎప్పట్లా సాధారణంగా ఈ డిన్నర్ కి రాగా, దీపికా పదుకునే మాత్రం టిప్ టాప్ గా తయారై వెళ్లింది. సీక్రెట్ గా వెళ్లినప్పటికీ ... మీడియా కంటబడడంతో ముఖాన్ని దాచుకునేందుకు అమ్మడు నానాతంటాలు పడిందని హాలీవుడ్ పత్రికల కథనం. ఇంతకీ లోగుట్టు ఏంటో వెల్లడికావాల్సి ఉంది.