: ఆ ఊరి వారు వింత పేర్లు పెట్టుకుంటారు!


కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో భద్రాపూర్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఊర్లో షారూఖ్, అమితాబ్ వంటి పేర్లే కాకుండా... గూగుల్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్, హైకోర్టు, మైసూర్ పాక్, కాఫీ వంటి పేర్లు కూడా మనుషులకు వున్నాయి. భద్రాపూర్ లో హక్కిఫిక్కీ అనే ఆదివాసీ తెగ వాసులు నివసిస్తున్నారు. వీరు 19వ శతాబ్దం వరకు అడవుల్లోనే నివసించేవారు. కాలానుగుణంగా అడవులను వదిలి బాహ్యప్రపంచంతో మమేకమవుతున్నారు. వీరికి చిత్రమైన అలవాటు ఉంది. ఈ తెగలో పిల్లల పేర్లు అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి, బాగా ఏది వాడుకలో ఉంటే అదే వారి పేరుగా మారిపోతుంది. ఈ కారణంగా 70లలో పుట్టిన వారిలో కోక్, పిస్తోలు, బ్రిటిష్ వంటి పేర్లు ఉంటే...80లలో సెలబ్రిటీలు, ఆహారపదార్థాల పేర్లను పిల్లలకు పెట్టారు. ఆ తరువాతి క్రమంలో అక్కడి వారికి హైకోర్టు, తాజ్ మహల్, గూగుల్, సౌత్, నార్త్ కొరియా, జపాన్, మైసూర్ పాక్, కాఫీ, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి పేర్లు పెట్టారు.

  • Loading...

More Telugu News