: గన్ తో పిల్లాడి ఆట...ప్రాణాపాయ స్థితిలో తల్లి!


అమెరికాలో తుపాకుల సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోతోందనడానికి ఉదాహరణగా నిలిచే సంఘటన న్యూయార్క్ లో చోటుచేసుకుంది. జాక్స్ విల్లే ప్రాంతానికి చెందిన జేమీ గిల్ట్ న్యాయవాదిగా పని చేస్తున్నారు. నాలుగేళ్ల తన కుమారుడిని వెనుక సీట్లో కూర్చోబెట్టుకుని ఆమె పుట్నంకౌంటీ ప్రాంతానికి బయల్దేరారు. వెనుక సీట్లో కూర్చున్న బాలుడు అక్కడే ఉన్న హ్యాండ్ గన్ తో ఆడుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కాడు. బుల్లెట్ నేరుగా ముందు సీట్లో కూర్చున్న జేమీ గిల్ట్ వీపులోకి దూసుకుపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న జేమీని గుర్తించిన అధికారులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు కొద్ది సేపటి ముందు, తన కుమారుడు టార్గెట్ ను షూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఆ తల్లి ఫేస్ బుక్ లో సరదాగా పోస్టు చేయడం విశేషం.

  • Loading...

More Telugu News