: శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమైన నిత్యానంద స్వామి... సినీ నటి రంజిత కూడా!
పలు పోలీసు కేసులను ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ఈ ఉదయం తన ప్రియ శిష్యురాలు, మాజీ నటి రంజితతో కలసి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యాడు. భారీ స్థాయిలో అనుచరులతో కలసి కాళహస్తికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. నిత్యానంద, రంజిత ఫోటోలు, వీడియోలను తీసేందుకు మీడియా ఉత్సాహం చూపగా, నిత్యానంద అనుచరులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొందరు దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది. మీడియాతో మాట్లాడకుండానే వీరిద్దరూ వెళ్లిపోయారు. కాగా, గతంలో నిత్యానంద, రంజితల రాసలీలల వీడియో బహిర్గతమై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.