: రెండు గంటలకు పైగా సాగిన యనమల పద్దు!
నవ్యాంధ్ర రాజధాని సహా, పోలవరం ప్రాజక్టు నిర్మాణం, వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, 2016-17 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దాదాపు 2 గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన తన ప్రసంగంలో యనమల అన్ని రంగాలను, అన్ని వర్గాల ప్రజలనూ కనీసం ఒక్కసారన్నా ప్రస్తావించారు. నూతన పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలను, యువతలో నైపుణ్యాన్ని పెంచే దిశగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన 'యనమల పద్దు' 2:04 నిమిషాలకు ముగిసింది.