: చెప్పుకున్నంత గొప్పగా లేదు: నరసింహన్ ప్రసంగంపై బీజేపీ పెదవివిరుపు


ఈ ఉదయం తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం చప్పగా సాగిందని బీజేపీ వ్యాఖ్యానించింది. బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగం అనంతరం ఆ పార్టీ శాసన సభా పక్ష నేత లక్ష్మణ్ మీడియాతో మట్లాడుతూ, చెప్పుకున్నంత గొప్పగా ఏమీ ఆయన ప్రసంగం సాగలేదని, టీఆర్ఎస్ రాసిచ్చిన కాగితాలనే ఆయన చదివి వినిపించారని పెదవి విరిచారు. కేసీఆర్ చెప్పినట్టు దళితులకు మూడెకరాల భూమి ప్రస్తావన ఇందులో లేకపోవడం కొంత నిరాశకు గురిచేసిందని అన్నారు.

  • Loading...

More Telugu News