: పెను విపత్తు ముందు ఇరాక్ లోని మోసుల్ నగరం: హెచ్చరించిన అమెరికా


ఇరాక్ లోని మోసుల్ నగరానికి సమీపంలోని ఆనకట్ట బద్దలయ్యే ప్రమాదం పొంచివుందని, అదే జరిగితే పెను విపత్తు సంభవించి, భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని అమెరికా హెచ్చరించింది. ఇరాక్ లో అతిపెద్ద డ్యామ్ గా పేరున్న ఈ ఆనకట్ట తెగితే, 45 అడుగుల ఎత్తున్న అల మోసుల్ నగరంపై పడుతుందని, ఈ నీరు బాగ్దాద్ వరకూ వెళుతుందని, 15 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకోవచ్చని పేర్కొంది. ఇరాన్ లో ఐరాస అంబాసిడర్ మహమ్మద్ అలీ అల్లాకిమ్ కు యూఎస్ అంబాసిడర్ సమంతా పోవర్ ఈ విషయాన్ని చెప్పి, మానవ ప్రాణాలు కాపాడేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు సైతం డ్యామ్ భవిష్యత్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్యామ్ పరిసరాలు ఐఎస్ఐఎస్ చేతుల్లో ఉండటంతో, దాని పరిరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News