: ఢిల్లీలో జేఎన్ యూ రీసెర్చి స్కాలర్ ఆత్మహత్య


దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న రీసెర్చి స్కాలర్ల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య యావత్తు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఆ వివాదం సద్దుమణగకముందే... ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ ర్యాలీ, జాతి వ్యతిరేక నినాదాలు, విద్యార్థులపై రాజద్రోహం కేసులు... దేశాన్ని కుదిపేశాయి. రాజకీయ ప్రకంపనలను సృష్టించాయి. తాజాగా జేఎన్ యూలోనే రీసెర్చి స్కాలర్ గా కొనసాగుతున్న దుశ్యంత్(25) అనే విద్యార్థి నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన దుశ్యంత్ వర్సిటీలో విద్యనభ్యసిస్తున్నా, దక్షిణ ఢిల్లీలోని బెర్ సరాయిలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ క్రమంలో నేటి తెల్లవారుజామున తన గదిలోనే విగతజీవిగా పడి ఉన్న అతడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుశ్యంత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News