: దీక్షపై పునరాలోచించాలని ముద్రగడను కోరిన పోలీసులు
కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను స్థానిక డీఎస్సీ ఆధ్వర్యంలో పోలీసులు కలిశారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో దీక్షను వాయిదా వేయాలని ఆయనకు వారు సూచించారు. దీనిపై ఆయన వారితో మాట్లాడుతూ, ప్రభుత్వం లేఖ పంపని పక్షంలో దీక్షకు దిగి తీరుతానని స్పష్టం చేశారు. ముద్రగడ దీక్షపై ప్రకటన చేయడంతో అధికార పక్షానికి చెందిన పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు దీక్షకు దిగవద్దని సూచిస్తూ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసుల సూచనను కూడా ఆయన తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ముద్రగడ దీక్షకు దిగడం ఇంచుమించు ఖరారైనట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.