: మూలవిరాట్ పాదాలను ముద్దాడిన సూర్య కిరణాలు... పులకించిన భక్తజనం
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో నేటి ఉదయం మరోమారు అద్భుతం సాక్షాత్కరించింది. అరసవిల్లి ఆలయంలోని సూర్యనారాయణుడి పాద పద్మాలను సూర్య కిరణాలు ముద్దాడాయి. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించిన భక్తజనం పరవశించిపోయింది. ఏటా రెండు సార్లు మాత్రమే సాక్షాత్కరించే ఈ సన్నివేశం నేటి ఉదయం చోటుచేసుకుంది. కేవలం నిమిషాల వ్యవధిలో మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి ఉదయం కనిపించిన ఈ అరుదైన దృశ్యం మళ్లీ అక్టోబర్ లో చోటుచేసుకోనుంది.