: రేపు ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న యనమల
రేపు ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఉపాధికల్పనకు ప్రాధాన్యమిస్తామని, అమరావతిలో మౌలిక వసతులకు నిధులు కేటాయిస్తామని అన్నారు. బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, అందుకుగాను కేంద్రం సాయం కోరుతున్నామన్నారు. ప్రజలపై పన్నుల భారం ఉండదని, త్వరలో యూత్ పాలసీ ప్రకటిస్తామని యనమల పేర్కొన్నారు.