: ‘బాహుబలి-2'సెట్ లో మంచి పోజ్ ఇచ్చిన ప్రభాస్


ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సీక్వెల్ 'బాహుబలి- ది కంక్లూజన్' రూపొందుతున్న సంగతి విదితమే. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా సెట్ లో హీరో ప్రభాస్ నిలబడి ఉన్న ఒక ఫొటోను సినిమా యూనిట్ తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. కాగా, ప్రభాస్ తో పాటు రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా బాహుబలి-1 ఎన్నో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళంతో పాటు హిందీలో కూడా విడుదలైన బాహుబలి దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలోనే అభిమానులు, ప్రేక్షకులు బాహుబలి-2పై కూడా భారీ అంచనాలతో ఉన్నారు.

  • Loading...

More Telugu News