: క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం నిర్వహిస్తాం: సీపీ మహేందర్ రెడ్డి


పోలీసులు స్వాధీనం చేసుకున్న, క్లెయిమ్ చేయని వాహనాలకు త్వరలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నవి, ఎవరూ క్లెయిమ్ చేయనవి కలిపి మొత్తం 4,222 వాహనాలు ఉన్నట్లు చెప్పారు. ఆ వాహనాలు గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉన్నాయని, స్టేడియంను ఖాళీ చేసేందుకే ఈ బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఈ వాహనాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వారి యాజమాన్య హక్కులకు సంబంధించిన ధ్రువపత్రాలను ఆరు నెలల లోపు నగర కమిషనర్ కు చూపించి..ఆ వాహనాలను తీసుకోవచ్చని సూచించారు. బహిరంగ వేలం నిర్వహించనున్న వాహనాల వివరాలను సంబంధిత అధికారులతో పాటు WWW.HYDERABADPOLICE.GOV.IN వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సీపీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News