: తెలంగాణకు వస్తున్న సుజలాన్: కేటీఆర్


తెలంగాణ రాష్ట్రానికి మరో దిగ్గజ కంపెనీ రానుంది. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను తెచ్చేందుకు ఎనర్జీ సంస్థ సుజలాన్ సిద్ధంగా ఉందని ఐటీ, మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తన ముంబై పర్యటనలో భాగంగా సుజలాన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తులసీ పంటితో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు సంస్థ ఆసక్తిని కనబరిచిందని తెలిపారు. వీటి నిర్మాణం పూర్తయితే 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందని వివరించారు. మొత్తం రూ. 1,200 కోట్ల అంచనా వ్యయంతో సోలార్ ప్యానల్స్ తయారీ ప్లాంటుకు సుజలాన్ ముందుకొచ్చిందని తెలిపారు. సుజలాన్ కు అవసరమైన అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ సర్కారు తరఫున హామీ ఇచ్చినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News