: దాయాదులొస్తున్నారు... పాక్ జట్టుకు లైన్ క్లియర్ చేసిన నవాజ్ షరీఫ్!
ఇండియాలో వరల్డ్ కప్ టీ-20 క్రికెట్ పోటీల్లో ఆడేందుకు చిరకాల ప్రత్యర్థి చాలా కాలం తరువాత భారత్ కు వస్తోంది. పాకిస్థాన్ జట్టు భారత పర్యటనకు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ అనుమతించారు. వాస్తవానికి పాక్ జట్టు ఈ పాటికే భారత్ కు చేరుకోవాల్సి వుండగా, ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ పై నెలకొన్న సందిగ్ధత కారణంగా జట్టు ప్రయాణాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక నేటి సాయంత్రం లేదా రేపు పాక్ జట్టు భారత్ కు వస్తుందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మొన్నటి ఆసియా కప్ టీ-20 మ్యాచ్ మినహా, పాక్ తో భారత్ ఆడింది లేదు. ఈ మ్యాచ్ కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా భద్రత కల్పించేందుకు కేంద్రం స్వయంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.