: బ్రిటన్ రాజకుటుంబానికి రూములు ఇవ్వలేమని చెప్పిన ఫ్రాన్స్ హోటల్!


బ్రిటన్ యువరాజు విలియమ్స్, ఆయన సతీమణి కేట్ మిడిల్ టన్ లకు తమ హోటల్ లో రూములను ఇవ్వలేమని ఫ్రాన్స్ లోని ఓ 5 స్టార్ హోటల్ స్పష్టం చేసింది. ఫ్రాన్స్ లో త్వరలో జరిగే 'బ్యాటిల్ ఆఫ్ ది సోమీ' ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న రాయల్ ఫ్యామిలీ, జూన్ 30 నుంచి రెండు రోజుల పాటు ఉండేందుకు ఎమియన్స్ సమీపంలోని లీ హోటల్ మారొట్టీలో నాలుగు సూట్లు కావాలని కోరగా, అందుకు హోటల్ యాజమాన్యం నిరాకరించింది. వేడుకలు జరిగే ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్న 5 స్టార్ హోటల్ అదే కావడంతో, బ్రిటన్ ప్రిన్స్ ఫ్యామిలీ అక్కడే బస చేయాలని భావించింది. అయితే, రాజకుటుంబానికి ఆతిథ్యం ఇవ్వడం తమకు గర్వకారణమే అయినా, ఆ సమయంలో గదులు ఖాళీ లేవని హోటల్ మేనేజర్ ఓలివర్ వాల్టీ వెల్లడించారు. గదులన్నీ ముందుగానే బుక్ అయిపోయాయని, ఇప్పుడా బుకింగ్స్ క్యాన్సిల్ చేయడం అసాధ్యమని అన్నారు. కాగా, సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో నిర్మించిన ఈ హోటల్ లో ఉండేది కేవలం 12 రూములే కాగా, ఒక రాత్రికి 350 పౌండ్లు (సుమారు రూ. 35 వేలు) వసూలు చేస్తారు.

  • Loading...

More Telugu News