: జీఎస్టీకి ఒప్పుకోండి... ఆ ఘనతా మీకే: రాహుల్ కు జైట్లీ చురక


ఈపీఎఫ్ పై బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా లోక్ సభ ముందుకు వచ్చిన 'విత్ డ్రాయల్స్ ఇంట్రస్ట్'పై కేంద్రం వెనకడుగు వేసిన తరువాత, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. తాను ఒత్తిడి తీసుకువచ్చిన ఫలితంగానే ఈపీఎఫ్ పై కొత్త పన్నుల భారం ఉద్యోగులపై పడలేదని రాహుల్ వ్యాఖ్యానించగా, జైట్లీ స్పందించారు. "ఈపీఎఫ్ పన్ను వెనక్కు తీసుకోవడం తమ ఘనతేనని కాంగ్రెస్, సోనియా అంటున్నారు. సంతోషం. ఇక జీఎస్టీ బిల్లును కూడా పాస్ చేయించిన ఘనత కూడా ఆయనే తీసుకోవచ్చు. పార్లమెంటును పనిచేయనిస్తే, ఎన్నో బిల్లులు ఆమోదం పొందుతాయి. వాటి క్రెడిట్ రాహుల్ కు ఇచ్చేందుకు అభ్యంతరం లేదు" అన్నారు.

  • Loading...

More Telugu News