: ఇండియాకు సమాచారం ఇచ్చాం... బయటికెలా పొక్కిందో: పాకిస్థాన్


మహాశివరాత్రి సందర్భంగా దాడులు జరిపే లక్ష్యంతో ఇండియాలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న సమాచారాన్ని ఇండియాతో పంచుకున్న విషయం నిజమేనని పాక్ స్పష్టం చేసింది. అయితే, తాము భారత అధికారులకు చెప్పిన విషయం మీడియాకు ఎలా లీకైందో తమకు తెలియదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి విదేశాంగ సలహాదారు సత్రాజ్ అజీజ్ తెలిపారు. తాము పలు దేశాలతో నిఘా వర్గాల సమాచారాన్ని పంచుకుంటూ ఉంటామని, ఇది నిత్యమూ జరుగుతుందని, ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు తమ దేశం కట్టుబడివుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. కాగా, పాక్ హెచ్చరికలతో న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, విజయవాడ, భోపాల్, సోమనాధ్ తదితర ప్రాంతాల్లో భద్రతను పెంచి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News