: ధర్మశాల వద్దే వద్దు... ఆగిన పాక్ ప్రయాణం!


19న ధర్మశాలలో భారత్, పాక్ మ్యాచ్ కి పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఈ మ్యాచ్ ని ధర్మశాలలో కాకుండా మరో చోటికి తరలించాలని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ ఐసీసీని కోరాడు. మరోవైపు పాక్ క్రికెట్ జట్టు భారత్ బయలుదేరాల్సిన సమయాన్ని వాయిదా వేస్తూ, తదుపరి నిర్ణయం వెల్లడించే వరకూ ప్రయాణాన్ని నిలపాలని పాక్ సర్కారు ఆదేశించింది. ధర్మశాల నుంచి మ్యాచ్ ని తరలించాలని ఐసీసీకి లేఖరాసిన పీసీబీ, సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని, మొహాలీ లేదా కోల్ కతాల్లో మ్యాచ్ నిర్వహించాలన్నది తమ అభిప్రాయమని ఖాన్ తెలిపారు. తమ జట్టుకు పూర్తి భద్రత ఉందని నమ్మితే ఇండియాతో ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమేనని అన్నారు. కాగా, క్రికెట్ జట్టు ధర్మశాలకు వెళ్లడం తమకు సమ్మతం కాదని పాక్ సెక్యూరిటీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News