: సిండికేట్ బ్యాంకు కార్యాలయాలు, అధికారుల ఇళ్లల్లో సీబీఐ సోదాలు


వెయ్యి కోట్ల రూపాయల నిధులను కాజేసిన ఆరోపణలతో సిండికేట్ బ్యాంకు కార్యాలయాలు, అధికారుల ఇళ్లల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫోర్జరీ, తప్పుడు బిల్లుల ద్వారా ఈ భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌ని సీబీఐ అధికారులు చెప్పారు. దీనిలో బ్యాంకు అధికారుల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మంగళవారం సీబీఐ అధికారులు ఢిల్లీ, జైపూర్, ఉదయ్ పూర్ లలో దాడులు చేశారు. మొత్తం పది ప్రాంతాల్లోని బ్యాంకు కార్యాల‌యాల్లో, అధికారుల ఇళ్ల‌ల్లో తనిఖీలు చేసినట్లు సీబీఐ ప్రతినిధి తెలిపారు.

  • Loading...

More Telugu News