: కొత్త ఇంటి అన్వేషణలో కత్రినా!
అందంతోపాటు అభినయంతో పిచ్చెక్కించే బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కొత్త ఇంటిని వెతికే పనిలో పడడంతో తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్‌తో విడిపోనుందేమోనన్న ఆమె అభిమానుల అనుమానాలకి తెరపడింది. అభిమానుల ఊహాగానాలే నిజమయ్యాయి. కత్రినాతో బ్రేక్ అప్ అవడంతో రణబీర్ తన తల్లిదండ్రులుండే బంగ్లాకి వెళ్లిపోయాడు. కత్రినా మాత్రం ఇన్నాళ్లూ ఉన్న చోటే నివసిస్తోంది. కానీ రణబీర్ తో నివసించిన అదే ఇంట్లో, అవే జ్ఞాపకాలతో కత్రినాకి నివసించాలనిపించడంలేదేమో కొత్తింటిని వెతుక్కునే పనిలో పడింది. త్వరలోనే మరో ఇంటికి మారనుందని తెలుస్తోంది. వృత్తిపరంగా కూడా కత్రినా లైఫ్ నెమ్మదిగా సాగుతోంది. తాజాగా విడుదలైన ఫితూర్ డిసాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.