: పీచేమూడ్!... ఈపీఎఫ్ పై ట్యాక్స్ ను ఉపసంహరించుకున్న కేంద్రం


ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ (భవిష్య నిధి) విత్ డ్రాయల్స్ పై ప్రతిపాదించిన ట్యాక్స్ విషయంపై కేంద్ర ప్రభుత్వం బ్యాక్ స్టెప్ తీసుకుంది. మొన్నటి 2016-17 బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పీఎఫ్ విత్ డ్రాయల్స్ పై పన్ను వేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కాకముందే పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. పీఎఫ్ పై పన్ను విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం నుంచి అందిన స్పష్టమైన సూచనతో రెండు రోజుల పాటు కసరత్తు చేసిన జైట్లీ వెనకడుగు వేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ లో ప్రసంగించిన సందర్భంగా జైట్లీ... పీఎఫ్ పై ట్యాక్స్ ను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News