: 'రైతు' లేదా 'గౌతమీపుత్ర శాతకర్ణి'... 100వ చిత్రంపై అమావాస్య తరువాత నిర్ణయం: బాలకృష్ణ
తన 100వ సినిమాపై అమావాస్య వెళ్లిన తరువాత నిర్ణయం తీసుకుంటానని హీరో బాలకృష్ణ ప్రకటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు, క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి కథలు రెడీగా ఉన్నాయని, ఏది ఫైనల్ అవుతుందన్నది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, రెండు సినిమాలనూ తానే చేస్తానని, ఒకటి ముందు, ఒకటి తరువాత అవుతుందని తెలిపారు. ఆదిత్య 369 సీక్వెల్ కు ఇంకా సమయం ఉందని, దానిలో తనతో పాటు మరో ప్రధాన పాత్రలో మోక్షజ్ఞ నటిస్తాడని వివరించారు. లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని యునెస్కోకు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.