: విమానాన్ని కూల్చేస్తానని భార్యకు పైలెట్ ఎస్ఎంఎస్... ఇటలీ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం!


"నువ్వు గనుక నన్ను వదిలేస్తే, ఆత్మహత్య చేసుకుంటా. అంతే కాదు... నేను నడిపే విమానాన్ని కూల్చి అందులో ఉన్న అందరినీ చంపేస్తా" అని ఓ పైలెట్ తన భార్యకు ఇచ్చిన సమాచారం, దాదాపు 200 మంది ప్రాణాలను కాపాడింది. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న తన భర్త ఇచ్చిన ఎస్ఎంఎస్ పై ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, టేకాఫ్ కు నిమిషాల ముందు పైలెట్ ను దించేశారు. విమానంలోని ప్రయాణికులకు విషయాన్ని తెలియనీయకుండా మరో పైలెట్ తో విమానాన్ని నడిపించారు. ఈ ఘటన ఇటలీలోని రోమ్ నుంచి జపాన్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న వేళ జరిగింది. భార్య తనను వదిలేసి వెళ్తానని బెదిరించడంతోనే అతను ఇలా చేశానని చెప్పినప్పటికీ, సదరు పైలెట్ కు ఇప్పుడు మానసిక చికిత్సకు అధికారులు సిఫార్సు చేశారు. కాగా, గతేడాది జర్మనీ పైలెట్ లూబిట్జ్ కావాలనే ఓ విమానాన్ని కూల్చేసి 149 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News