: డోపింగ్ కు పాల్పడ్డ టెన్నిస్ స్టార్ షరపోవా... 4 ఏళ్ల నిషేధం?


టెన్నిస్ లో అందాల భామగా పేరుపడ్డ రష్యా స్టార్ మారియా షరపోవా చిక్కుల్లో పడింది. ఆటలో రాణించేందుకు ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిందట. ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా జరిపిన డ్రగ్ పరీక్షల్లో ఆమె నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియంను వాడినట్లు తేలింది. ఈ మేరకు ఆమెపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించేందుకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. డోపింగ్ లో పట్టుబడ్డ విషయాన్ని స్వయంగా షరపోవానే నిన్న లాస్ ఏంజెలిస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించింది. ‘‘డోపింగ్ పరీక్షల్లో ఫెయిలయ్యా. దీనికి పూర్తి బాధ్యత నాదే. చాలా పెద్ద తప్పు చేశా. అభిమానుల మనసులను గాయపరిచా. నాలుగేళ్ల వయసు నుంచి టెన్నిస్ ఆడుతున్నా. టెన్నిస్ ను ఎంతో ప్రేమించా. డోపీగా తేలిన వారికి ఎదురయ్యే పరిణామాల గురించి తెలుసు. అర్థాంతరంగా కెరీర్ ను ముగించాలని కోరుకోవడం లేదు. మరో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News