: భారత్ ఆటగాళ్లంటే పాక్ ప్రజలకు ఎంత అభిమానమో తెలుసా?: ఇంజమామ్


భారత్, పాకిస్థాన్ ప్రజల మధ్య విభేదాలు లేవని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ తెలిపాడు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో గంగూలీతో కలిసి పాల్గొన్న సందర్భంగా ఇంజమామ్ 2004లో భారత జట్టు పాకిస్థాన్ లో పర్యటించిన రోజులను గుర్తుచేసుకున్నాడు. ఈ పర్యటన సందర్భంగా పలువురు భారత్ ఆటగాళ్లు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా వివిధ ప్రాంతాలకు వెళ్లారని గుర్తుచేశాడు. ఆ సందర్భంగా పలు రెస్టారెంట్లకు టీమిండియా ఆటగాళ్లు వెళ్లారని, వారికి ఆతిథ్యం ఇచ్చిన ఏ రెస్టారెంట్ కూడా డబ్బులు తీసుకోలేదని అన్నాడు. పలు ప్రాంతాల్లో టీమిండియా ఆటగాళ్లు షాపింగ్ కు వెళ్లారని, వారి వెంట తమ ఆటగాళ్లు కూడా వెళ్లేవారని, ఆయా ప్రాంతాల గురించి భారత ఆటగాళ్లకు వివరించేవారని చెప్పాడు. షాపింగ్ సందర్భంగా కూడా ఎవరూ భారత ఆటగాళ్ల నుంచి డబ్బులు తీసుకోలేదని ఇంజీ గుర్తుచేశాడు. ధర్మశాలలో భారత్-పాక్ మ్యాచ్ జరగాలని ఇంజీ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News