: లేడీస్ స్పెషల్... మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిరిండియా ప్రపంచ రికార్డు!


ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్ ఇండియా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళలను గౌరవిస్తూ, పూర్తిగా మహిళా సిబ్బందితో సుదూరతీరాలకు విమానాన్ని నడిపి ఎయిర్ ఇండియా రికార్డు నెలకొల్పింది. మార్చి 6న కాక్ పిట్ స్టాఫ్, చెకింగ్ స్టాఫ్, కస్టమర్ కేర్ సిబ్బంది, వైద్యులు, టెక్నికల్ స్టాఫ్ ఇలా ప్రతి ఉద్యోగి మహిళ ఉండేలా చూసిన ఎయిర్ ఇండియా అధికారులు న్యూఢిల్లీ నుంచి 14,500 కిలోమీటర్ల దూరంలో అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి 17 గంటల పాటు సుదీర్ఘంగా విమానం నడిపించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలో పూర్తి స్థాయిలో మహిళలతో సుదీర్ఘ ప్రయాణం చేసిన విమానం ఇదేనని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇది చారిత్రాత్మకమని, మహిళల పట్ల ఎయిరిండియా ప్రత్యేక గౌరవం చూపిస్తుందని ఆ సంస్థ సీఎండీ అశ్వినీ లోహనీ తెలిపారు. ఎయిర్ ఇండియాలో మొత్తం 3,800 మంది మహిళా సిబ్బంది విధులు నిర్వర్తించడం విశేషం.

  • Loading...

More Telugu News