: కేసీఆర్ బృందానికి గవర్నర్ ఆతిథ్యం


రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబైలోని రాజ్ భవన్ కు చేరుకున్నారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, సాగునీటి ఉన్నతాధికారులకు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు సాదర స్వాగతం పలికారు. నీటి పారుదల ఒప్పందాలు చేసుకునేందుకు వచ్చిన వారందరికీ గవర్నర్ ఆతిథ్యమిచ్చారు. రేపు సీఎం కేసీఆర్ మహారాష్ట్రతో మేడిగడ్డి సహా ఐదు బ్యారేజీల నిర్మాణంపై ఒప్పందాలు చేసుకోనున్నారు. రేపు జరగనున్న సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకోనున్నారు.

  • Loading...

More Telugu News