: 'సరైనోడు' పాట కోసం బొలీవియా వెళ్తున్నాం: రకుల్ ప్రీత్ సింగ్


అల్లు అర్జున్ సరసన తాను కథానాయికగా నటిస్తున్న 'సరైనోడు' షూటింగుకు సంబంధించి ఇక ఒకే ఒక్కపాట పెండింగ్ లో ఉందని, దానిని పూర్తి చేసేందుకు బొలీవియా వెళ్తున్నామని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. ఈ పాట పూర్తయ్యాక ఈ నెలాఖరులో ఆడియో వేడుక ఉండవచ్చని, ఏప్రిల్ లో సినిమా విడుదలవుతుందని రకుల్ వెల్లడించింది. సినిమా చాలా బాగా వచ్చిందని తెలిపింది. కాగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ తొలిసారి 'సరైనోడు' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News