: ట్రైన్ నుంచి మూడు సార్లు విడిపోయిన బోగీలు


ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ జోధ్ పూర్-జైపూర్ మార్గంలో ప్రయాణిస్తుండగా ట్రైన్ నుంచి బోగీలు విడిపోయాయి. ఇలా ఒకసారి జరిగితే పొరపాటున అలా జరిగిందని సరిపెట్టుకుంటాం...అదే రెండు, మూడు సార్లు జరిగితే...దానిని ఉద్యోగుల నిర్లక్ష్యం అనాల్సిందే. జోధ్ పూర్-జైపూర్ మార్గంలో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తుండగా గోతాన్, రెన్, జుల్సూ స్టేషన్ ల మధ్య వరుసగా మూడు సార్లు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయి. బోగీల మధ్యనుండే కప్లింగ్ విడిపోవడంతో ఇలా వేరుపడిన బోగీలు కొంత దూరం వెనుక ఉండిపోయాయి. అయితే రైలుకు ఉండే ఆటోమెటిక్ బ్రేకింగ్ సిస్టమ్ సరిగా పని చేయడం వల్ల రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, కేవలం రైలు ప్రయాణం నాలుగు గంటలు ఆలస్యంగా జరిగిందని మాత్రం అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News